తరువు మానవ ఆదెరువు: పిల్లి.హజరత్తయ్య శింగరాయకొండజిల్లా : ప్రకాశం-చరవాణి: 9848606573
21) చెట్లు భూసారాన్ని రక్షించు
ప్రకృతి సోయగాలు చేకూర్చు
వ్యవసాయంలో ప్రధానపాత్ర పోషించు
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

 22) అలంకార వస్తువులకు పెట్టిందిపేరు
పోషక విలువలకు ప్రధానవనరు
ప్రకృతి సంరక్షణ మనబాధ్యత
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

 23) మానవ మనుగడకు ఆధారం
పచ్చదనం ప్రగతికి సంకేతం

భవిష్యత్తు తరాలకు జీవనాధారం
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

 24) చెట్లు ఆరోగ్యానికి నిలయాలు
మానవాళికి ఆర్థిక వనరులు
దేవుడు మనిషికిచ్చిన వరాలు
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

25) పర్యావరణానికి చెట్లు ప్రాణాలు
జీవనానికి మూలం మొక్కలు
మొక్కలు నాటడం దేవకార్యం
*చూడచక్కని తెలుగు సున్నితంబు*