*అంశం: శ్రమ శక్తి:-పిల్లి.హజరత్తయ్య--శింగరాయకొండజిల్లా : ప్రకాశంచరవాణి: 9848606573
46) రక్తాన్ని చెమటగా ధారవోసి
రేయనక పగలనక కష్టించి
సమాజగతిని మార్చే శ్రామికులం
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

 47) దళారులు మోసం చేసినా
ఆశించిన ప్రతిఫలం రాకున్నా
 శ్రమనే ఆయుధంగా నమ్మినవాళ్ళం
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

 48) ప్రజల ఆకలిని తీర్చుతాం
దేశప్రగతికి పునాది వేస్తాం

జాతి భవిష్యత్తును నిర్మిస్తాం
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

49) కార్మికచట్టాలు ఎన్ని ఉన్నా
జీవన పోరాటంలో ఓడుతాం
హక్కుల సాధనకై ఉద్యమిస్తాం
*చూడచక్కని తెలుగు సున్నితంబు*

50) కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా
సామాజిక భద్రతే లక్ష్యంగా
సమసమాజ స్థాపనకు కృషిచేస్తాం
*చూడచక్కని తెలుగు సున్నితంబు*