ప్రయాణం లో ఒక అనుభవం: కె. వెంకట రమణ రావు ,సెల్ 9866186864

 చుట్టాల ఇంట్లో పెళ్లి కి  హైద్రాబాద్ వెళ్లి , తిరిగి విశాఖపట్నం వెళ్ళడానికి మా కుటుంబము సికిందరాబాదు  స్టేషన్ చేరుకున్నాము. గోదావరి ఎక్స్ప్రెస్  కి అనౌన్స్మెంట్ అయింది . రైలు రాగానే మేము అందరం మా బోగి లో ఎక్కి బెర్త్ నంబర్స్ చూసుకుని సామాన్లు సర్ది నేను , నా భార్య , ఇద్దరు మా ఇద్దరు అమ్మాయిలు కూర్చున్నాము . ఇంతలో ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలని మా ఎదురుగా బెర్త్ లో కూర్చో పెట్టి రక రకాల జాగ్రత్తలు చెప్తూ,విశాఖపట్నం స్టేషన్  కి వాళ్ళ ఇంకొక అన్నయ్య వస్తాడు అని చెప్తున్నాడు. ఆ  అమ్మాయిలు అతని చెల్లెల్లు అని అర్ధం అయింది. బెదురూ బెదురూ గా చూస్తున్నారు. ట్రైన్ బయలుదేరింది . ఆ  అబ్బాయి   కళ్ళల్లో నీళ్లతో మాతో ,  కొంచెం చూస్తూ ఉండండి అని చెప్పి దిగిపోయాడు.
నా భార్య వాళ్ళను పలకరించింది. ఆ అమ్మాయిలు కూడా విశాఖపట్నం వెళ్తున్నారు. ఒక అమ్మాయికి మాత్రం బెర్త్ ఉంది , రెండో అమ్మాయికి బెర్త్ కన్ఫర్మ్ కాలేదు అని చెప్పింది.
పరవాలేదు టి టి ఇ వస్తే మాట్లాడండి అని చెప్పింది నా భార్య . ఒక అర గంట తర్వాత టి టి ఇ వచ్చాడు. మా టికెట్ లు చెక్ చేసి , ఆ అమ్మాయిల వైపు చూసి టికెట్ లు అడిగాడు .
అమ్మాయిలు టికెట్ కాగితం చూపించారు. అదేంటి ఒకటే బెర్త్ కదా కన్ఫర్మ్ అయింది ఇద్దరు ఎలా వెళతారు . ఫైన్ కట్టాలి , తర్వాత స్టేషన్ కాజీపేట లో దిగిపోయి జనరల్ టికెట్ కొనుక్కుని జనరల్ బోగి లో కూర్చో అని  ఆ అమ్మాయికి చెప్పాడు . ఆ అమ్మాయి ఏడుస్తూ నాకు ఏమీ తెలియదు ఎలా దిగాలి ఎక్కడ టికెట్ కొనుక్కోవాలి అని వాళ్ళ అన్నకి ఫోన్ లో చెప్పింది. ఆ అన్నకి  ఎం చెయ్యాలో తెలీక మళ్ళీ టి టి ఇ ని బ్రతిమాలమని చెప్పాడు.
ఇదంతా చూస్తున్న నా భార్య కలిపించుకుని టి టి ఇ  దగ్గరకి వెళ్లి రిక్వెస్ట్ చేసింది . ఒకవేళ పెనాల్టీ కట్టాలి అంటే మేము ఇస్తాము, మీరు ఆ అమ్మాయికి సహాయం చెయ్యండి. ఇద్దరు అక్కాచెల్లెళ్లు వాళ్ళు. ఎప్పుడు ఇలా ఒంటరిగా ప్రయాణం చెయ్య లేదట. మీరు కొంచెం పరిష్కారం చెప్పండి అని అడిగింది.
టి టి ఇ ఒక సారి ఆలోచించి , కాజీపేట లో ఒక జనరల్ టికెట్ విశాఖపట్నం వరకు తీసుకుని నాకు ఇవ్వండి , నేను రిజర్వేషన్ , బెర్త్ కి డబ్బులు కట్టించుకుని రసీదు ఇస్తా
అప్పుడు వాళ్ళు ఇద్దరు ఒక బెర్త్ మీద సరిపెట్టుకోవచ్చు ,ఈ  లోగా ఎక్కడైనా బెర్త్ ఖాళీ అయితే నేను చూస్తా అని చెప్పాడు . చాలా థాంక్స్ అని నా భార్య మా దగ్గరకి వచ్చి , కాజిపేట్ లో విశాఖపట్నం కి  ఒక జనరల్ టికెట్ కావాలి అని చెప్పింది,
ఎలా దిగుతాము , క్యూ ఉంటె చాల కష్టం, మన ట్రైన్ వెళ్ళిపోతుంది అని అన్నాను. మా పిల్లలు కూడా ఇది చాల రిస్క్ అని అన్నారు .
మరి ఎలా ఆలోచించండి , పాపం ఆ అమ్మాయి  ఏడుస్తోంది అంటూ చెప్పింది.
ఎలా,  ఎం చేద్దాం అంటూ నేను పిల్లలు రంగం లోకి దిగాము. మా కజిన్ కూతురు కాకతీయ మెడికల్ కాలేజీ లో మెడిసిన్ చదువుతోంది. వరంగల్ లో హాస్టల్ లో ఉంటోంది. మా అమ్మాయి వెంటనే తనకి ఫోన్ చేసింది. ఇంకొక గంటన్నర లో రైలు కాజిపేట్ చేరుకుంటుంది . విశాఖపట్నం కి ఒక జనరల్ టికెట్ కొని మాకు కాజిపేట్ స్టేషన్ లో మా బోగి దగ్గర ఇవ్వాలి అని అడిగాము. పరిస్థితి అర్థం చేసుకున్న మా కజిన్ కూతురు , కాజీపేట లో ఉంటున్న తన క్లాస్ మెట్ కి ఫోన్ చేసి విషయం చెప్పింది. సరే నేను టికెట్ తీసుకుని మీ వాళ్ళకి  ఇస్తా అని ఆ అబ్బాయి చెప్పాడు. ఆ అబ్బాయికి నా ఫోన్ నెంబర్ ఇచ్చింది.
ట్రైన్ కాజిపేట్ కి దగ్గర అవుతూ ఉంటె నాకు ఫోన్ వచ్చింది , బోగి నెంబర్ చెప్పమని  , ట్రైన్ ఆగింది స్టేషన్ లో , ఒక అబ్బాయి నా దగ్గరకి వచ్చి మీరేనా విశాఖపట్నం టికెట్ అడిగారు అని అన్నాడు. అవును అని చెప్పి టికెట్ తీసుకుని , ఆ అబ్బాయికి డబ్బు ఇచ్చి చాలా చాలా థాంక్స్ అన్నాను. అవసరం ఉన్నప్పుడు మనం సహాయం చెయ్యాలి కదండీ, నేను చేసింది ఏముంది , ఒక టికెట్ కొని ఇచ్చా , అంతే అన్నాడు ఆ మెడికో స్టూడెంట్.  నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిలకి మీరు  చాలా విలువైన సహాయం చేశారు. ఆ అమ్మాయిలు మీ మేలు ఎప్పటికి మరువరు అంటూ బోగి లోపలి కి వెళ్ళాను.
రైలు కదిలిన తరువాత టి టి ఇ  వచ్చి టికెట్ కొన్నారా అని అడిగాడు. నేను ఇచ్చిన టికెట్ తీసుకుని మిగిలిన చార్జీలు అడిగాడు. నా భార్య మేము ఇస్తాము అంటూ ఆ డబ్బు ఇచ్చి , టి టి ఇ  ఇచ్చిన రసీదు ఆ అమ్మాయిలకి ఇచ్చి ఇంక నిశ్చింత గా ఉండమని చెప్పింది. ఈ విషయం వాళ్ళ అన్నయ్యకి చెప్పారు, అతను నా భార్య తో ఏడుస్తూ మీరు దేవుడు పంపినట్లుగా మాకు సహాయం చేసారు, ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలి అని థాంక్స్ చెప్పుకున్నాడు.
నా పిల్లలు ఇద్దరు చాలా సంతోషించారు. ఆ తర్వాత ఆ అమ్మాయిలు ఇద్దరు మాతో పాటు టిఫిన్ తిని మిగిలిన ప్రయాణం కొనసాగించారు. ఇదంతా చూస్తున్న పక్కన   బెర్త్ ల వాళ్ళు మా  ఇద్దరు అమ్మాయిలని , నా భార్య ని చాలా మెచ్చుకోలుగా చూశారు. చిన్న పిల్లయినా మీ అమ్మాయిలు ఎంత తొందరగా ఆర్గనైజ్ చేశారు అని అన్నారు .K VENKATA RAMANA RAO
VISAKHAPATNAM
MOBILE 9866186864

కామెంట్‌లు