*సూక్తిసుధ (కందపద్యములు)*;-*మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట* *చలవాణి:9949144820*

పొద్దున నెల్లరు మేల్కొని
శుద్దిగస్నానంబుజేసిశుభ్రతతోడన్
బుద్ధిగమాతాపితరుల శ్రద్ధగసేవించమీకుసద్గుణమబ్బున్

వనములుమెండుగయున్నచొ
జనులకుహితములెకలుగునుజయములనొందన్
పనులనునాపకజేసిన
చనువులుపెరుగంగనేడుచైతన్యమొలుకున్

ఎండిన నేలలుతడపగ
నిండిన చెరువులనురైతునిగురముతోడన్
 మెండుగసంతసమొందుతు
 పండినపంటలనుజూసిపరవశమొందెన్


కామెంట్‌లు