భక్త మందారమా! ఇష్టపది ప్రక్రియ: :-కవిచక్రవర్తిడాక్టర్ అడిగొప్పుల సదయ్యకరీంనగర్9963991125

ఆదిశేషునివోలె అన్ని నేనై నీకు
సేవలను భక్తితో చేయనానతినీర!

నరుడిలా సఖ్యమును నెరప నిరతము నీతొ
సమయమును నాకొరకు సవరించుకో సామి!

ఇక్షురసముల చిలుకు ఇంపైన నీకథలు
క్రోలుటకు నాచెవులు కోర్కెచూపెడుతాయి

జగన్మోహనమైన నగవులను వెదజల్లు
వదనారవిందమును వాంఛించు నా కనులు

సకల జీవులు కోరు సద్గతిని యగు మీ
పాదాబ్జముల వాల పరితపించును శిరము

గోదమ్మనై నేను కోర్కెతో నిష్టపది
మాలికల కూర్చితిని మహతి ప్రేమను చేర్చి...