.చిన్న పిల్లల ఆటలు(బాల గేయం..)బొమ్ము విమల,మల్కాజ్ గిరి,9989775161
చేయి చేయి కలుపుదాం
చిందులేసి ఎగురుదాం
కోతి కొమ్మచి ఆడుదాం
చెట్టు పండ్లను తెంపుదాం

చేయి చేయి కలుపుదాం
చెమ్మ చెక్క లాడుదాం
చేతులు కొట్టి చప్పట్లకూ......
తగు విధంగా దూకుదాం

దాగుడు మూతలాడుదాం
దండాకోర్ చెప్పు కుంటూ
వారి పేర్లను చెప్పుదాం
దొంగను వెదికి పట్టుదాం

చిన్ని చిన్ని ఆటలెన్నో
చిలిపిగా ఆడుకొంటూ
మన బాల్యాన్ని అందరం
ఆనందంగా గడుపుదాం