ఎడారి ఒంటె(బాల గేయం.)-బొమ్ము విమల,మల్కాజ్గిరి,9989775161

ఎడారి ఒంటె వచ్చింది
ఎంతో ఎత్తు మెడ ఉంది   
వీదులన్ని తిరుగుతూ
మా వీధిలోకి వచ్చింది

ఒంటె యజమానొచ్చాడు
గుడి వద్దన నిలిపాడు
పిల్లలు దాన్ని చూసారు
అమ్మా నాన్నల పిలిచారు

పిల్లలు ఒంటెను ఎక్కారు
ఊరు అంతా తిరిగారు
మూపురాన్ని పట్టుకొని
ఒంటెను తాకి చూసారు

అమ్మా నాన్నలు మెచ్చారు
డబ్బులు వాడికి ఇచ్చారు
ఆనందంతో పిల్లలంతా
ఎగురుతు గంతులేసారు