పిల్లిపేరు* (కథ)("రాజశ్రీ"కవితా ప్రక్రియలో);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 1)
పిల్లి పిల్లను తెచ్చిరి
అవ్వ తాత పెంచిరి
ఆ పిల్లి నల్లనిది
దాని ముక్కు తెల్లనిది!
2)
నల్లటివి దాని కాళ్ళు
నల్లటివే వేళ్ళ గోళ్ళు
నల్ల పిల్లి పెరిగెను
పెరిగి పెద్దది ఆయెను!
3)
ఒక్క రోజు అవ్వతో
తాత పలికె బాధ్యతతో
ముద్దు పిల్లి పెరిగింది
పెరిగి పెద్దది అయ్యింది!
4)
పిల్లిని అయితే పెంచినాము
పేరు పెట్ట మరిచినాము
దాని పేరు పెట్టేస్తా
"మేఘము" అని పిలిచేస్తా!
(సశేషం)