వానపాట:(బాలల గీతం)--: శాంతి కృష్ణ
పల్లవి//
వానా వానా కురవాలి
వీధి వీధి తడవాలి
వాగులు వంకలు పొంగాలి
వయ్యారంగా కదలాలి ॥వానా॥

చరణం- 1
వేకువ జామున కురిసేవాన
వెన్నెల కన్నా చల్ల చల్లన
బడి గంటలకు సెలవిచ్చి
చలి దుప్పట్లో ఒదిగేద్దామా ॥వానా॥

చరణం-2
సందెపొద్దుకు ఈ వాన
జోరు జోరుగా కురిసేన
చందమామను రమ్మని పిలిచి
చక్కిలి గింతలు పెట్టేద్దామా ॥వానా॥

చరణం-3
కలలో నువ్వే ఓ వాన
కురిసి అలసే విరివాన
కదిలీ కదిలీ ఓ వాన
మళ్ళీ రావా ఎపుడైనా...
నువ్వు మళ్ళీ రావా ఎపుడైనా...॥వానా॥


కామెంట్‌లు