*యోగ్యతా పత్రాలు!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1.విశ్వభాగ్యవిధాత!
   నోబెల్ బహుమతి గ్రహీత!
   ఆస్కార్ అవార్డు విజేత!
   మిస్టర్ యూనివర్స్!
   మిస్ యూనివర్స్!
2.భారతరత్న మెరుపు!
   జ్ఞానపీఠం గెలుపు!
   ద్రోణాచార్య పిలుపు!
   దాదాసాహెబ్ గుర్తింపు!
3.జనహృదయాల్లో నిలిచిన,
           నాయకశిరోమణులు!
   వెండితెరపై వెలిగిన,
     జనారాధనశిఖామణులు!
   గంధర్వగానం పలికించిన,
      మధురాధరగాత్రధారులు!
  అరవై నాలుగు కళల్లో,
    వాసికెక్కిన సూత్రధారులు!
4.పరిపాలనా దురంధరులు!
   హడలెత్తించిన నియంతలు!
   చక్రం తిప్పిన రాజనీతిజ్ఞులు!
  మార్గం చూపిన తత్త్వవేత్తలు!
5.ఈ యోగ్యతా పత్రాలన్నీ,
         ఇక్కడే ఉండిపోతాయి!
   దైన్యంలేని జీవనం!
   దేశసేవలో మరణం!
   ఈ రెండే,మహాప్రస్థానంలో! 
   మనిషి వెంట నడిచే,
 *యోగ్యతా పతాకాలు!*