*మర్రి విత్తు!*:-డా.పి.విఎల్.సుబ్బారావు.

 1.కరోనా కాలాన,
   కాలం కలిసొచ్చిన వాళ్ళు!
   కేంద్ర మంత్రులు అయ్యారు!
రాష్ట్రముఖ్యమంత్రులయ్యారు!
  గవర్నర్లు గా నియామకం!
అధికార్లు ఉన్నతాధికారులు!
2.ధనవవంతులు ఎదిగారు!
   వ్యాపారాలు విస్తరించారు!
 కవులు ఉర్రూతలూగించారు!
ఎందరో బతికి బయటపడ్డారు!
3.మరోపక్క! ఎందరో!
   తల్లి/తండ్రి/ ఇద్దరినీ,
   కోల్పోయి అనాథలైనారు!
   బతుకులు చితికినవాళ్ళు!
   నేలకి అతుక్కు పోయారు!
   జీవనాధారదారం తెగినోళ్ళు!
 ముందడుగు మరిచిపోయారు!
4.కలిసొచ్చినవాళ్ళకి విన్నపం!
   ఏడుకొండలవాడికి!
   బంగారు కిరీటాలొద్దు!
  ఉన్నబంగారమే బరువు!
  ఐ.టి.ఎగ్జంప్షనొస్తుందని!
  ఛారిటీలు ప్రకటించొద్దు!
5.ఈదేశాన ,
       లక్ష్మీనారాయణులకన్న!
  దరిద్రనారాయణులే మిన్న!
 వారిలో కొందరికైనా మీ వంతు,
 వాక్సిన్ వేయించండి!ఇక్కడ,
 సంపన్నులేకాదు, ఆదుకొనే,
 ఆపన్నహస్తాలున్నవాళ్ళకి,
 కొదవ లేదని నిరూపించండి!
ఈ పని మర్రి విత్తు!
ఆ"మంచి"మర్రిచెట్టంత ఎత్తు!