సైనికులకు వందనం: -పిల్లి.హజరత్తయ్య:శింగరాయకొండ

91) హిమాలయ శిఖరం అంచున
పరిస్థితులు అనుకూలించక పోయినా
రక్షణకై రాజీపడని ధీరులు
చూడచక్కని తెలుగు సున్నితంబు

92) జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదిలి
జన్మభూమి రుణం తీర్చుకోవడానికి
నిరంతరం శ్రమిస్తున్న శూరులు
చూడచక్కని తెలుగు సున్నితంబు

93) మరణం తథ్యమని తెలిసినా 
ప్రాణాలను లెక్కచేయక శత్రుసైన్యాలను
తుదముట్టించే వీరులే జవాన్లు
చూడచక్కని తెలుగు సున్నితంబు

94 దేశం కోసం ప్రాణాలనిచ్చి
ప్రజల హృదయాలలో కొలువైన
రక్షక దేవుళ్ళ జవాన్లు
చూడచక్కని తెలుగు సున్నితంబు

95)వెన్ను చూపని సాహసికులు
తెగువను చూపే త్యాగధనులు
మరణాన్ని ముద్దాడే మృత్యుంజయులు
చూడచక్కని తెలుగు సున్నితంబు
కామెంట్‌లు