తుమ్మి పూలు, :- పి . కమలాకర్ రావు
 తుమ్మి పూలు, ఆకులతో  ఆరోగ్యాన్నిచ్చే రుచికరమైన
రసం తయారీ విధానం  :
ఈ కాలంలో విపరీతంగా తుమ్మి పూలు పూస్తాయి. దీని ఆకులు , పూలు ఆహారంలో వాడితే మంచి
ఆరోగ్యాన్ని కలుగ జేస్తాయి. ఇది
త్రిదోష హారిణి, రొమ్ము పడిశాన్ని
తగ్గిస్తుంది. శరీరంలో  చేరిన విష క్రిములను చంపుతుంది. స్త్రీలకు బహిస్టు  సమస్యలకు మందు గా
పనిచేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది .
 కొన్ని తుమ్మి ఆకులను, పూలను తెచ్చి  ఉప్పు పసుపు కలిపిన నీటిలో బాగా కడిగి, నువ్వుల నూనెతో పోపు వేసి  అందులో
వెల్లుల్లి ముద్ద, జిలకరపొడి, అవాల పొడి, ఇంగువ, మిరియాల పొడి  వేసి, చింతపండు రాసా
ఉప్పు కలుపుకోవాలి.  ఇది చాలా
రుచికరమైన ఆరోగ్యాన్నిచ్చే వంటకం.
తుమ్మి ఆకులను పెసరు పప్పులో
వేసుకొని కూడా తినవచ్చు.