సృష్టికి దేవత :--- మచ్చ అనురాధతెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా
ఆడపిల్లంటెనే యవనికి వెలుగులు
పంచేటి జ్యోతిగన్ పరిగణించు,
సృష్టికి దేవత సిరులకు మూలము
తండ్రికి కానుక దైవమిచ్చె,
తల్లిదండ్రులు జూసి తన భాగ్యమని యెంచి
మురిసిపోవుదురిల ముదముతోడ,
కంటికి రెప్పగన్ కాపాడ కష్టమౌ
బయటకు పంపుట భయము కలుగు,
కన్నవారి కలలు కను విందు జేయుచు
చదువు సంధ్యలయందు సాగు ముందు,
పెళ్లి జేసియుపంప  ప్రేమతో  జూసెడి
భర్త లభించిన భవిత వెలుగు,
ముద్దు గులాబీకి ముల్లున్న విధముగన్
న్నాడపిల్లలబాధయందరెరుగు,
 కలకంఠి కంటన కన్నీరు న్నొలికినన్
దేశ భాగ్యంబులు దీనమౌను.

తేటగీతి.

ప్రేమ జూపును తల్లిలా ప్రీతితోడ,
యింట తిరుగును లక్ష్మీలా, యెదుగు గొప్ప,
కంటెకూతుర్ని కనవలె కనులవిందు,
అమ్మ లేని యిల్లును జూడ నడవి సమము.