వచన ;పద్యాలు : : చెన్నా సాయిరమణి

1)కల్పవృక్ష కౌముది కళ్యాణ కాంతుల 
కళల కోమల కమ్మని కావ్యాల
కుసుమ కోమల కవన కనక భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

2)సాహిత్య సౌకుమార్య సుమధుర సుభాషిత 
సుందర సువర్ణ సౌజన్య సుమతీ 
సంగీత సుమాలిక సన్నిహిత సోమ భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

3)రవి రక్షణ రవళి రంగుల 
రామ రాజస రాధ రమణ 
రమా రుపా రమ్య రమణీయ భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

4)కళ్యాణ కోమలి కౌముద కారుణ్య 
కుసుమ క్రొoజ కోయిల కూతల
కమల కమనీయ కావ్యాల కీర్తి భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

5)తార విజయంబుర దివ్యoబర కావ్యంబర 
సింధూర ఆనందకందర బంధుర విశ్వంభర 
మధుర మందార సుందర అంబర భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !