గురువు( గేయం)-యెల్లు . అనురాధ రాజేశ్వర్రెడ్డితెలుగుభాషోపాధ్యాయులుసిద్దిపేటజడ్.పి.హెచ్.ఎస్ కుకునూరుపల్లి

 శాంతి సహనం మన గురువు
 సత్య మార్గము మన గురువు
 వెన్నెల నవ్వుల మన గురువు
 నిండు పున్నమి మన గురువు
// గురువు//

 మిల మిల మెరిసే మన గురువు
 వసంత రుతువు మన గురువు
 అక్షర జ్యోతి మన గురువు 
ఆది నేత్రం మన గురువు 
//గురువు//

  జగత్తులను చూపే మన గురువు
 అలుపెరుగని మన గురువు 
 ఆదిశంకరులు మన గురువు
 విశ్వ వారధిగురువు గురువు
// గురువు//

 శాస్త్రం చెప్పే మన గురువు
 చైతన్యం పెంచే మన గురువు
 భిన్నత్వంలో ఏకత్వం
 మార్గం చూపే మన గురువు
// గురువు///కామెంట్‌లు