శ్రీరామునిపై హనుమంతునికి గల భక్తితత్పరత,ప్రకృతి(తేటగీతి పద్యాలు)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 శ్రీరామునిపై హనుమంతునికి గల భక్తి తత్పరత:
 
రాజ్య పట్టాభి షేకము రామ ‌మయము
భక్తి కలిగిన‌ హనుమకు‌ భయము‌ లేక
అడిగె రాఘవు నతిగాను ఆశ తోడ
నిల్చె రాముడు మారుతి నిండు యెడద            
               :ప్రకృతి:
గాలి‌ మారెను మనుజుల‌ గాఢ తతుల
నేల చచ్చెను తొలచిన నేర గుణము
నీరు కలుషిత మాయెను నీచ పనుల
నింగి నంటెను కాలుష్య నీడ నిజము