*స్నేహితులు* (కథ)("రాజశ్రీ" కవితా ప్రక్రియలో)(ఐదవభాగము):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 17)
అక్కడ ఉన్నారు దుర్ముఖులు
వారంతా శక్తికి పూజారులు
దారిన బోవు వారిబట్టి
శక్తికి బలియిత్తురు కత్తిబట్టి!
18)
వారు వీరు ఎదురయిరి
వారు వీరు కలహించిరి
ఏకహస్తుడైన బడుగు వైరులలోఒకడిని
కంఠనాళము ఉత్తరించె అత్తరిని!
19)
అది చూసిన వేరొకడు
దుర్ముఖుడు పట్టలేని కోపగాడు
బడుగువాని నొడిసిపట్టి కన్నుపొడిచె
కూలదోసి కాలు విరిచె!
20)
అంతలోనే మహాకాయు డటువచ్చె
వైరులబట్టి వారి పొగరణచె
అటుపై మువ్వురు ముంందుకేగిరి
మరింతచిక్కటి వనములోకి చేరిరి!
(సశేషం)