గెలుపెవరిది? (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

  ఓ పాఠశాలలో వార్షికోత్సవం జరుగుతుంది. ఈ సంధర్బంగా  విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నారు. వీటిలో భాగంగా పరుగు పందెం పోటీలు పెట్టారు. విద్యార్థులు చాలా మంది పాల్గొన్నారు. పోటీ ప్రారంభమైంది. విజిల్ వేయగానే పోటీ దారులు పరుగందుకున్నారు.  కొంత దూరం పోయాక  వారిలో ఒకడు కాలు మెలికపడి కిందపడిపోయాడు. మిలిగినవారు వాడిని పట్టించుకోకుండా గెలవాలనే సంకల్పంతో  వేగంగా వెళ్లిపోయారు. వారిలో ఒకడు మాత్రం ఆగాడు. కిందపడిన వాడిని లేపాడు. వాడి కాలును సరి చేసాడు. లేపి నడిపించాడు. ఇద్దరూ బయటకు వచ్చారు.
   ఆశ్చర్యంగా న్యాయ నిర్ణేతలు   లేపి నడిపించినవాడిని కూడా విజేతగా ప్రకటించారు. "నిజమైన విజేత గెలిచినవారు మాత్రమే కాదు, ఇతరులమీద జాలి, దయ, కనికరం కలవారు  కూడా  విజేతలే" నని ఆ తరువాత జరిగిన బహుమతి ప్రధాన  ఉపన్యాసంలో చెప్పారు.  "ఒకవేళ మేం విజేతగా అతడిని ప్రకటించకపోయిన ప్రజల హృదయాలలో నిజమైన విజేత అతడే" అన్నారు.  అందరూ చప్పట్లు కొట్టారు. 
కామెంట్‌లు