పొడుపు బాల గేయం:-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట

గోడ మీది బొమ్మ
గోప్యంగున్నది
కదిలేటి బొమ్మ
కతర్ నాక్ బొమ్మ

ఎరుపు రంగులోన
నలుపు రంగులోన
బూడిద రంగులోన
రంగు రంగుల బొమ్మ

బూరు బూరు బొమ్మ
పారుకుంటు వస్తుంది
పక్కకింద ఉంటుంది
కొండి తోక ఉంటుంది

కాలుకు తాగిలిందంటే
కాటు వేసి పోతుంది
చాలా నొప్పి లేస్తుంది
చల్లని చెమటలొస్తాయి

గేయంలో గుట్టు విప్పండి
మీరు దాని పేరు చెప్పండి

కామెంట్‌లు