*పిల్లిపేరు* (కథ)("రాజశ్రీ" కవితా ప్రక్రియలో)(రెండవభాగం):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 5)
అట్లైతే అది ఇంకాబాగా
ఎదుగుతుంది తుష్టిగా పుష్టిగా
నింగిని అంట గలుగుతుంది
అంతటి పొడుగు పెరుగుతుంది!
6)
చూసేవారికి ఎంతో వింత
చోద్యము ఎంతో ఉండునంత
అది మ్యావుమ్యావు అంటేనూ
ఎల్లరికీ పిడుగుమోత వింటేనూ!
7)
అప్పుడు అవ్వపలికె ఇలా
కూడదు ఇది అలా
మబ్బుకేమి గొప్ప ఉంది
గాలికే అది పోతుంది!
8)
బిగువు బిర్రు లేకుండు
మేఘము కడు తేలికుండు
మేఘము కంటెను గాలి
బలువైనది అని నమ్మాలి!
(సశేషం)