సూక్తిసుధ:-సరళ గున్నాల.
శా*దేహమ్మున్శ్రమజేయనేరకెదుగన్ ధీశాలినేనంచు తా
బాహాటమ్ముగముంచినెత్తుకెదగన్ బాగోగులన్జూడకన్
దాహమ్మై ధనమే జగత్తని మదిన్ తానేగునెంతెత్తుకో
ఆ హాయుండునపోవకుండ
నెపుడున్నన్యాయమే వీడుమా

శా*మాటాడన్ మృదుభాషణమ్ము నదియే మాణిక్యమైదారులన్
దాటన్వేయగ తప్పులందునిను  నోదారైనజూపించగన్
వాటమ్మున్ గని వాక్కుశుద్ధి నెరుపన్వాగ్మంచునిన్మెచ్చుచున్
ధీటౌనీవిక గొప్పవక్త వనుచున్ దేశమ్మునన్కీర్తియే