*కవిత్వం*:-*అయిత అనిత*జగిత్యాల
మదిలోని
భావతుంపరలన్నీ
అక్షరఘరులై పారడం!
ఆలోచన అలలు
కెరటాలై ఎగిసి
కవనతీరాన్ని తాకడం!!

వేదన ఆవిరులన్నీ
ద్రవించి
ఆనందాశ్రువులుగా మారడం!
వెతల తిమిరాలన్నీ
ఓదార్పు కాంతులవ్వడం!!

సమస్యల సుడిగుండాలను దాటే
పరిష్కారమార్గాలుగా జనించడం
పదాలపూలన్నీ
వాక్యాలుగా అల్లుకోవడం
పాఠకుల హృదయసీమల్లో
ఆహ్లాదమై నర్తించడమే కవిత్వం!

ఉద్యమాలకు నాంది
మార్పుకు సారధి కవిత్వం!!