*స్నేహితులు* (కథ)("రాజశ్రీ" కవితా ప్రక్రియలో)(ఆరవభాగము):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 21)
అక్కడ ఉన్నారు ఘోరదంష్ట్రులు
వారంతకంటె మహా ఘోరులు
వారు వీరు ఎదురయిరి
వారు వీరు కలహించిరి!
22)
అల్పుడపుడు వైరిభుజము ఎక్కెను
లాఘవమున డొక్కలోన బాకుదూర్చిచంపెను
వేరొక దంష్ట్రుడు అల్పునిబట్టె
మెడను నడుమును విరుగగొట్టె!
23)
అప్పుడొచ్చిన మహాకాయుడు వైరులదునుమాడె
అల్పుని ప్రాణాలను కాపాడె
వీరుడవు ఓహో మిత్రమా
ఇంకొక గెలుపుంది పోదమా!
24)
అప్పుడు నీవు చిరకీర్తిని
బడయ గలవు బహుకీర్తిని
అని నవ్విన మహాకాయుడు
నిజానికి వాడు లోనభీరుడు!
(సశేషం)