పిల్లిపేరు* (కథ)("రాజశ్రీ"కవితా ప్రక్రియలో)(ఐదవభాగం):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్

 17)
మరి నీవు పిచ్చిదానివా
ఇంత కూడా యోచించలేవా
పిల్లి ఉంది పెద్దది
ఎలుక ఎట్లు దొడ్డది!
18)
పిల్లికి ఎలుక లోకువ
నీవు చిన్ననాడె చదువవ
ఎందుకు మనకు తగాయిదా
"పిల్లి" అనెడి పేరులేదా!
19)
పిల్లి పేరు పిల్లియే
మార్చ మనకు వెర్రియే
పిల్లి పేరు మార్చినంత
గుణము మారునా ఎంత!
20)
మనము అందరం వెర్రివాళ్ళమే
ఏదో పేరు పెట్టేవాళ్ళమే
సరైన పేరు దేవుడిచ్చాడు
మనిషియే వెర్రితో ఇలాచేస్తాడు!!
(సమాప్తం)

కామెంట్‌లు