కవిసామ్రాట్;-పిల్లి.హజరత్తయ్య, శింగరాయకొండ, ప్రకాశం జిల్లా

విశ్వనాధవారి కవిత్వమే సంస్కృతికి చిహ్నము
విశ్వనాధవారి హృదయమే నవ్య నవనీత సమానము

విశ్వనాధవారి దాతృత్వమే అతి కర్ణము
వారి ఆదరమే అనుభవైక వేద్యము

“నాది వ్యవహార భాష” యని ప్రకటించిన విశ్వనాథుడు
ఆంగ్లభాష వ్యామోహాన్ని ఎండగట్టిన కవీశ్వరుడు

సంప్రదాయాలు తగ్గుతున్నప్పుడు సాహిత్యంతో మేల్కోలిపెను
విలువలు నశిస్తున్నప్పుడు సాహిత్య మేథతో బ్రతికించెను

దేశవిదేశాలలో అభిమానులను పొందిన మూలవిరాట్
అత్యున్నత పురస్కారాలను సంపాదించిన కవిసామ్రాట్

జయంతి పత్రికలో సాహితీ ప్రియులను అలరించెను
కిన్నెరసాని పాటలతో ఆంధ్ర వైభవాన్ని చాటెను

తెలుగువారి మణిహారమే మన సాహిత్య సురభుడు
తెలుగువారి ఆణిముత్యమే మన విశ్వనాథుడు

తెలుగునాట మెరిసిన జ్ఞానపీఠ గుణస్రష్ట
తెలుగు సాహితీ ప్రపంచంలో బహుముఖీన సాహితీ స్రష్ట

విశ్వనాధ లేకపోతే తెలుగు సాహిత్యమే లేదు 
విశ్వనాథను మరిస్తే సాహితీలోకం క్షమించదు

కామెంట్‌లు