వాన బాలల గేయం- అనురాధ రాజేశ్వర్ రెడ్డి


చిటపట చినుకుల వాన 

చిరుజలై కురిసేనా

 వడి వడి చినుకుల వాన 

ఉప్పెనలా పొంగేనా

// చిటపట//

 వాగులు వంకలు నిండి

 వడివడిగా వెళ్లేనా

 చెరువులు కుంటలు నిండి

 చిందులు వేసేనా

// చిటపట//

రైతులు మురిసే వాన

 నేలంతా తడిసేనా

 పశుపక్షాదులు అంతా

 ఊపిరి పీల్చేనా

// చిటపట //


శృతి మించిన వాన

 తట్టుకోలేని వాన 

 అతివృష్టి వాన 

కోలుకో లేము దేవా

//చిటపట//