తెలంగాణ యాస భాష:-సామలేటి లింగమూర్తి సర్వక్రియ త్రీభాష కవి శతాధికగ్రంథకర్త సిద్దిపేట
తెలుగు భాష వెలుగు భాష
తెలంగాణ యాస భాష
పల్లె ప్రజలు పలికె భాష
పాట లెన్నో పాడే భాష "తెలుగు"

వీనులకు విందు భాష
జానల కలుపులో భాష
బాట సారుల హృదయము
రంజింపజేసె భాష    "తెలుగు"

పెనిమిటి పెండ్లామని
ప్రేమతోడ పిలిచె భాష
కొట్టము చుట్టము దొడ్డియనె
గట్టిగాను ప

లికె భాష    "తెలుగు"

మసికె బొంత బట్టపేగు
మాటలు వున్న భాష
ముట్టు ముట్టు ముట్టుయనెడి
మూడు భావాల భాష "తెలుగు"