అందం ఆరోగ్యం.(బా)ల గేయం. తాటి కోల పద్మావతి గుంటూరు.

 బలమైన ఆహారం పుష్టికరమైన ఆహారం
 అందానికి ఆరోగ్యానికి పెరుగుదలకు
 మంచి పోషకాలను ఇచ్చే విటమిన్ ఉన్న ఆహారం.
బాలల్లారా భావి భారత పౌరుల్లారా 
చదువులోనూ ఆట పాటల్లోనూ అన్నింటిలో 
ముందుండాలంటే అందానికి ఆరోగ్యానికి
 పనికి వచ్చే ఆహారం తినాలి.
కూరగాయలు బీర దోస కాకర 
ఆనపకాయ చిక్కుడు బటాని 
దొండ బెండ విటమినులు ఉన్న కూరగాయలు అండి
అందానికి ఆరోగ్యానికి ఆకుపచ్చని కూరలు ఎంతో మేలు.
ఆకుకూరలు అమ్మ ఆకుకూరలు గోంగూర 
తోటకూర పాలకూర బచ్చలి ఆకుపచ్చని 
ఆకుకూరలు కంటికి వంటికి 
ఆరోగ్యానికి అందానికి ఎంతో మేలు.
పాలోయమ్మ పాలు చిక్కటి పాలు 
చక్కటి పాలు తీయటి చల్లటి పాలు.
కంటికి వంటికి పోషకాలను ఇచ్చే పాలు. 
ఎదగడానికి సాయపడే ఆరోగ్యానికి విటమిన్ ఉన్న పాలు.
పండ్లు అమ్మ పండ్లు అరటి జామ 
మామిడి పనస దానిమ్మ నారింజ నేరేడు
రంగురంగుల పండ్లు 
రకరకాల తీయటి పుల్లటి పండ్లు.
కంటికి వంటికి అందానికి ఆరోగ్యానికి మంచి మంచి పండ్లు.
పిల్లల్లారా చదువులోనూ ఆట పాటల్లోనూ 
అందరికన్నా ముందుండాలంటే బలమైన ఆహారం 
తీసుకోవాలి. పోషకాహారం పోషిస్తే నే విటమిన్ లన్ని 
కలసికట్టుగా పెరుగుదలకు దోహదపడతాయి 
నేటి బాలలకు రేపటి పౌరులకు 
బలమైన ఆహారం కావాలంటే అన్ని ఆరగించాలి.
అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు

కామెంట్‌లు