తినగ తినగ వేప తియ్యన: కె. వెంకట రమణ రావు

 రోజూ లాగే కథ చెప్పమని నా పక్కలో చేరాడు మా చిన్నా. ఇవాళ స్కూల్ లో ఏం చెప్పారు అని అడిగాను. నాన్నా నాకు అర్థం కాలేదు తినగ తినగ వేప తియ్యనగును అని టీచర్ పాఠం లో చెప్పారు. అది ఎలా నాన్నా వేప ఆకు చేదుగానే ఉంటుంది కదా. రోజూ తింటే ఎలా తియ్య గా అవుతుంది అని అడిగాడు. మా స్కూల్ లో వేప చెట్టు ఆకులు నమిలి చూసాను. బాబోయ్ చాల చేదు గా ఉంది. మరి తియ్యగా ఎలా అవుతుంది అంటూ ఆశ్చర్యం గా అడిగాడు.
ఏం చెప్పాలా అని ఒక నిమిషం ఆలోచించాను. తినగ తినగ వేప కూడా తియ్య గా అవుతుంది అంటే, మనం ఏదన్నా కష్టం అనుకునే పని రోజు చేస్తున్న కొద్దీ సులభం అవుతుంది అని అర్థం
నువ్వు  పెయింటింగ్ వెస్తావు కదా, మొదట్లో ఎలా వేసే వాడివి , పిచ్చి గీతలు గీసే వాడివి, మరి ఇప్పుడు చూడు ఎంత బాగా బొమ్మలు వేస్తున్నావు. సైకిల్ నేర్చుకునే టప్పుడు ఎన్ని సార్లు కింద పడ్డావు, మరి ఇప్పుడు చూడు ఎంత చక్కగా సైకిల్ మీద స్కూల్ కి వెళ్తున్నావు. అలాగే అర్థం అవని పాఠాలు కూడా పదె పదే చదివితే బాగా అర్ధం అవుతాయి.
చేదు గా అనిపించే వేప ఆకు రోజూ కొంచం నములు తూ ఉంటే కొన్నిరోజులకు నీకు అలవాటు అయి ఆ చేదు నీకు తెలీదు.
ఏదన్నా మనం కష్టం అనుకున్నప్పుడు బాగా ప్రయత్నం చేస్తే గ ఆ పని మనకి సులభం గా అనిపిస్తుంది. ఇదే వేప తినగ తినగ తీపి అంటే. తెలిసిందా.
 
  అర్థం అయింది నాన్నా . కాఫీ రైటింగ్ కూడా అంతే కదా , బాగా రాస్తే  చేతి వ్రాత కూడా బాగా అవుతుంది అని టీచర్ చెప్పారు. సరే ఇంక పడుకో అంటూ వాడిని నిద్రబుచ్చాను.
K VENKATA RAMANA RAO
VISAKHAPATNAM
MOBILE 9866186864