గురువు : -బెజుగాం శ్రీజ -ట్రిపుల్ ఐటీ బాసర గుఱ్ఱాలగొంది జిల్లా సిద్ధిపేట

 *సీసమాలిక*
విద్యతోపాటుగ విజ్ఞానమునుపంచి
సంస్కారమునునేర్పు శ్రమకునోర్చి
తప్పులుసరిదిద్ది దైవమై మనపట్ల
దేశభక్తినిచాటు తేజముగను
అజ్ఞానమనియెడి నంధకారముబాపి
విజ్ఞానమనియెడి వెలుగునిడునె
గురువుయెవిష్ణువు గురువుయెదైవంగ
మోక్షంబునిచ్చునే మోదమలర
గురువుయెసాక్షాత్తు పరబ్రహ్మ సమవుజ్జి
బాధపెట్టవలదు బ్రహ్మ యతడు
గురువు మార్గంబులో గొప్పగమసలిన
దేవునంతటిగొప్ప దీవెనిడుగ
*తేటగీతి*
నిత్యముకృషిని జేస్తూనె నేర్పుగాంచి
అక్షరజ్యోతినింపునె యందముగను
వందనంబులు పాదాభి వందనంబు
మరువబోమయ్యమిమ్ముల
మదనినెపుడు

కామెంట్‌లు