వన దేవతలు: కి. వెంకట రమణ రావు

 రోజూ లాగే రాత్రి చిన్నా, పక్కలో చేరాడు. స్కూల్ విషయాలు అడిగాను. ఇవాళ మా టీచర్ వనదేవతలు పాఠం చెప్పారు .  చెట్లు దేవతలు అని చెప్పారు. మనకి కావలసినవి అన్నీ ఇస్తాయట. ఇది ఎలాగో నాకు అర్ధం కాలేదు. చెట్టు దేవత ఎలా అవుతుంది. చెప్పు నాన్నా.
చెట్లు దేవతలే చిన్నా. ఎందుకంటే మనకి కావలసిన  ఆహారం ఇస్తాయి , పీల్చడానికి శుభ్రమైన గాలి ఇస్తాయి, వర్షం పడేలా మబ్బులని ఆకర్షిస్తాయి , వర్షాలు పడితే మంచి పంటలు పండి తినడానికి ఆహారం దొరుకుతుంది. మనమే కాదు జంతువులు కూడా చెట్ల మీదే ఆధార పడ్డాయి. అడవి లో జంతువులు ఉండడానికి చెట్లు కావాలి , లేక పోతే ఆ జంతువులు అన్నీ మన ఊర్ల లోకి మనుషులు ఉండే చోటకి వచ్చేస్తాయి.
వన దేవతలు భూమి మీద మనకోసం వచ్చిన దేవతలు.
స్కూల్ లో నువ్వు కూర్చునే నీ బల్ల,  నీ  కుర్చీ , ఇప్పుడు నువ్వు పడుకున్న మంచం అన్నీ చెట్లనుంచే కదా తయారు చేశారు.
గ్రామాల్లో ఇల్లు కట్టుకోవడానికి, వంట కోసం చెట్లు వాటి కట్టె ని ఇస్తాయి. పువ్వులు , పళ్ళు అన్నీ చెట్లే కదా ఇస్తాయి.
అందుకే చెట్లు మనకి వనదేవతలు.
మనం చెట్లకి హాని చెయ్యకూడదు , జాగ్రత్తగా కాపాడు కోవాలి. చెట్లని మనం సంరక్షిస్థే అవి మనలని రక్షిస్తాయి.
అవును నాన్నా నేను నా ఫ్రెండ్స్ చెట్లని జాగ్రత్త గా చూస్తాము , స్కూల్ లో ,అందరి ఇళ్ళల్లో కూడా మొక్కలు నాటుతాము.
చిన్నా మాటలు నాకు చాలా తృప్తి ఇచ్చాయి. ఆ పసి మెదడు కో ఒక మంచి ఆలోచన అనే మొక్క నాటాను. నిద్రలో జారుకున్నాడు చిన్నా ..
 
K VENKATA RAMANA RAO
MOBILE  9866186864
కామెంట్‌లు