13)
చెట్టుపుట్టలు తమిదీర తనియగా
కిలకిలా రావాల పక్షులెగరగా
ఆనంద కలకలము అంతటా
తీరింది దాహపు ముచ్చటా!
14)
భగీరథుని పితృ పితామహుల
సమాధులను గంగజేసింది గలగల
వారు తరియించి నాకముజేరగా
భగీరథుడు సంతోష పడగా!
15)
గలగలా పారేను గంగమ్మతల్లి
అణువణువు పులకించె పుడమిశోభిల్లి
పుణ్యక్షేత్రాల ముంగిట ప్రవహించింది
యాత్రభక్తులను పావనము చేసింది!
16)
తాగు సాగు నీరు
భువి పులకించి పారు
ఆయువు ఆరోగ్యము ఇచ్చు
పాపాలనుండి జనులను ఉద్ధరించు!
(సశేషము)
*గంగావతరణము* (కథ)("రాజశ్రీ" కవితా ప్రక్రియలో)(నాలుగవభాగము)- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి