//విజయం// //బాల గేయం//-యెల్లు.అనురాధ రాజేశ్వర్ రెడ్డి తెలుగు భాషోపాధ్యాయులు జడ్పీహెచ్ఎస్ కుకునూరుపల్లి సిద్దిపేట

భగ భగ భగ భగ భానుడు
 మండే ఎండను ఇచ్చెను
 చీకటి అంతా పోయెను
 ఈ లోకం వెలుగును చూశెను
// భగ//
 కోటి ఆశలే పుట్టెను
 అడుగెనుక అడుగు వేశెను
 భయాన్ని పక్కన పెట్టాను
 విజయం వైపు గా వెళ్లాను
// భగ//
 మెదడుకు పదును పెట్టెను
 శారీరక శ్రమను చేశెను
 సుడిగాలై విజృంభించేను
 అనుకున్నది వడిగా చేశాను
// భగ//
 రామసక్కని విజయం
 రంజిల్లుతూ వచ్చెను
 వెను తిరగని కార్యసాధన
 వెనువెంటనే వచ్చెను
// భగ/
 
కామెంట్‌లు