మానవీయం ...!! (చిత్ర కవిత ):- ----డా.కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ

 మానవత్వం పరిమళిస్తే 
ప్రతిమనిషి మంచివాడే 
లింగభేదానికిక్కడ 
చోటులేనేలేదు ...!
మోసంచేయని 
రిక్షాకార్మికుడూ .......
మానవీయతకలిగిఉన్న 
ప్రయాణికు(రాలు) డు
సమాజానిక వసరమైన,
మానవమణిపూసలే....!
సంస్కార జీవులే.....
సహృదయ మూర్తులే....!