గజల్:-*అయిత అనిత*


లోకాన్నే నాకునువ్వు చూపెదవూ నాకలమా!
మదిభారం ఆసాంతం దింపెదవూ నాకలమా!!

అన్యాయం ఎక్కడున్న అడగబోవు ధైర్యమిచ్చి
ఆవేదన అక్షరంగ రాసెదవూ నాకలమా

అందమైన ప్రకృతిలో అణువణువును వీక్షించీ
నయనాలలొ అద్భుతంగ దాచెదవూ నాకలమా

లోనగుణం గ్రహించుతూ లోపాలను కనిపెడుతూ
రచనల్లో మానవతను లేపెదవూ నాకలమా

హృదయానికి నేస్తానిగ విడిపోనీ బంధమేసి
అనుకవనపు మధురిమలే పంచెదవూ నాకలమా