బాలగేయం:-సత్యవాణి

 డబ్బుల డిబ్బీ నాకుంది

డబ్బులు దాస్తా నేనందు
అమ్మమ్మ ఇచ్చిన ఐదూ పదులూ
తాతయ్యిచ్చిన వందకాగితం
మావయ్యిచ్చిన కొత్తనోటులు
అత్తయ్యిచ్చిన ఐదు వందలూ
నాన్న ఇచ్చిన నాలుగు పదులూ
మా అమ్మిచ్చే చిల్లర మల్లర
డిబ్బీలో లోనా దాస్తాను
డబ్బుల డిబ్బీనందున దస్తాను
డిబ్బీ నిండగ డబ్బులు తీసి
రక్షణ నిధికీ ఇస్తాను
దేశ రక్షణ నిధికీ నేనిస్తా