కోకిలమ్మ ప్రబోధము:---గద్వాల సోమన్న
కొమ్మ మీద కూర్చుంది
కచేరి మొదలెట్టింది
కమ్మని కంఠంతో
కోకిలమ్మ పాడింది

నలుపు రంగు తనువైనా
తెలుపుతుంది  గొంతు ఘనత
ఆకృతి  చిన్నదైనా
అపురూపము దాని చరిత

ప్రతిభ ఉంటే గౌరవము
ప్రతిచోటా నీరాజనము
అందుతుంది అంటుంది
అందరికీ చెపుతోంది

కోకిలమ్మ ప్రబోధము
ఎల్లరికి ఆమోదము
వర్ణ వివక్షత వీడిన
మనసునిండా ప్రమోదము

ప్రతిభ వెలికి తీయాలి
పదిమందికి పంచాలి
దేశకీర్తి చాటాలి
ఘన స్ఫూర్తి నివ్వాలి