*గుణింత గేయాలు*--*'✔️' తలకట్టు గేయం*:- *వురిమళ్ల సునంద,ఖమ్మం*

 కమల అమల నడవగ
అమల పలక పగలగ
వలవల అమల ఏడవగ
వదనం అంత తడవగ
వనజ పలక ఈయగ
ఆనందంగ అమల ఆడగ
-------------------------------------
ఇందులో ప్రత్యేకత ఏమిటంటే
రాబోయే గుణింతం ఇందులో రాదు.
పిల్లలు తేలికగా నేర్చకోగలుగుతారు.