సాహితీ కిరణం ఈ "చిటికెన ":- కీర్తి పూర్ణిమ : ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, వ్యాసకర్త


 ఇంటర్నేషనల్ బెనోవోలెన్ట్ రీసెర్చ్ ఫౌండేషన్ గౌరవ సభ్యత్వం అందుకున్న సందర్భంగా డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ గారి తో టూకీగా ముఖాముఖీ 

సాహిత్యంలో  500 లకు పైగా రచనలు...కవిగా, కథకుడిగా,  రచయితగా, సమీక్షకుడిగా... 
ప్రముఖ సాహితీవేత్త  డా.  చిటికెన కిరణ్ కుమార్ చేస్తున్న సేవ కి మెచ్చి ఇంటర్నేషనల్ బెనోవోలెన్ట్ రీసెర్చ్ ఫౌండేషన్ గౌరవ సభ్యత్వంఅందుకున్నారు.
అందులో సభ్యత్వం అందుకున్న తొలి తెలుగు రాష్ట్రం వారు కావడం తెలుగు భాష సాహిత్యానికి ముత్యాల పల్లకి అందించడం లాంటిది.
 రవి కాంచని చోట  కవి కాంచును.... అని వినే ఉంటాం.అవును నిజమే మరి...!*డాక్టర్ చిటికెన మాటగా ఒక కథ కన్నీళ్లు పెట్టించ గలదు అదే కథ కన్నీళ్ళని తుడవగలదు. నాటి కథను నేడు బాసటగా, నేటి కథను రేపటికి రూపంగా అందించేది కథకుడే* అని అంటారు ఆయన...
* కుటుంబ నేపథ్యం, విద్యా?*
 డా. చిటికెన కిరణ్ కుమార్,అక్టోబర్  6, 1980  న సిరిసిల్ల లో జన్మించారు.తల్లి తండ్రులు చిటికెన కనకయ్య, ఉమా గారు,భార్య చిటికిన పల్లవి,పిల్లలు సిరివదన,  హంసిక.
రాజన్న జిల్లా సిరిసిల్లా లో ప్రాథమిక విద్య, రాజరాజేశ్వరి ప్రభుత్వ డిగ్రీ  కళాశాలలో ఉన్నత విద్యను పూర్తి చేసాను...
కాకతీయ యూనివర్సిటీ లో ఎం.కామ్ పూర్తి చేసాను.
 *మీ సాహితీ ప్రస్థానం మీ మాటల్లో?   
 
    నేటికీ వివిధ దినపత్రికలు,  ఆన్ లైన్ పత్రికలు,, వార పత్రికలు మాస పత్రికలలో నేను రాసిన  కథలు, వ్యాసాలు, సమీక్షలు, కవితలు. ఇప్పటివరకు వివిధ పత్రికలలో 500లకు పైగా  ప్రచురితమయ్యాయి.
        భవితకు రూపం పుస్తకం,  స్త్రీ విద్య దేశానికి ప్రామాణికం,  వనితా నీకు వందనం,  సామాజిక చైతన్యమే సమసమాజ నిర్మాణం, ఆన్లైన్ క్లాసులు తో పిల్లల దారెటు..., వైద్యులే  దేవుళ్ళు దేవతలు , సమాజ సేవలో భాగంగా అవుతున్న రచయితలు...మరియు  తన రచనలను స్త్రీల పక్షాన కొనసాగించడం తన రచనా సాహిత్యానికి గర్వకారణం . సామాజికంగా స్త్రీకి జరుగుతున్నటువంటి అసమానతలను, సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను,  “ స్త్రీ తన జననం ఒక చోట తన మరణం మరోచోట". సృష్టికి మూలం స్త్రీ, రైతన్న గురించి మరియు  సామాజిక పరిస్థితుల్లో ఆరోగ్యం గురించి మీ ఆరోగ్యం మీ చేతుల్లో , కరోనా  ఏం నేర్పుతుంది లాంటి ఎన్నో వ్యాసాలు ప్రచురించబడ్డాయి.
*అచ్చయిన  మీ తొలి రచన?  
 కథ – “అనుబంధం” విశాలాక్షి సాహితీ మాస పత్రిక
*మీ రచనల్లో మీకు చాలా నచ్చిన ఒక రచన?
 
చేనేత కార్మికుల యొక్క బతుకు చిత్రాన్ని దృష్టిలో పెట్టుకొని  " చేనేత న్నకు పండుగ బతుకు"    అనే శీర్షికన వ్యాసం ప్రచురితమై నేత కార్మికుల యొక్క జీవన గమనాన్ని తెలియపరచింది.నా రచనలు అన్నీ నాకు ఇష్టమే కానీ కార్మికుల వ్యధ నీ తెలిపిన ఆ వ్యాసం అంటే కాస్త ఎక్కువ ఇష్టం.

*మొదటి రచన?మొదటి అభినందన?
1999 లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ ( కేస్ స్టడీ ఆన్    సిరిసిల్ల టెక్స్ టైల్స్     ఇండస్ట్రీ విత్ రిఫరెన్స్ టు మెస్సర్స్ చిటికిన కనకయ్య టెక్స్ టైల్ కంపెనీ )   పేరుతొ అందరి మన్ననలను పొందిన సందర్భం....
మీకు స్పూర్తినీ  అందించిన వారు?
సాహిత్యంలో సి. నారాయణ రెడ్డి గారు  ఆదర్శం 
మరియు దూదిపాల జ్యోతి రెడ్డి  (  “ కీ  “ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్- యూ. ఎస్. నివాసం ) అధినేత్రి గారు. 
*సాహిత్యం లో మీ వెన్నంటి వుండి నడిపించిన వారు?
డా. వడ్ఢేపెల్లి కృష్ణ గారి ప్రోత్సాహం
 * మీ జీవిత ఆశయం?
 సమాజానికి ఉపయోగపడే రచనలు చేయాలని అందరికి సుపరిచితుడనవ్వాలని..... 
*మీకు స్ఫూర్తిని ఇచ్చిన కథ?
 
ఐనా ... నేను ఓడిపోలేదు... 
జ్యోతి రెడ్డి గారి ఆత్మకథ రోజు వారి కూలీ నుండి
ఖండాంతర  ఖ్యాతి గడించిన ఒక ఆదర్శ మహిళ యదార్థ ప్రత్యక్ష జీవిత  గాధ .. 

*ఇష్టమైన పుస్తకాలు?
రూట్స్ - అలెక్స్ హేలే            
విజయానికి ఐదు మెట్లు
యండమూరి వీరేంద్రనాథ్
*నేటి యువత కి మీరు ఇచ్చే సందేశం?
దేశ ప్రగతికి సోపానాలు యువతే.వారు సరయిన దిశలో పయనిస్తే దేశం కూడా ప్రగతి బాట పడుతుంది. ఆగస్టు పదిహేను వచ్చిన ఒక్క రోజే దేశభక్తి వుంటే సరిపోధుగా!
దాదాపు వంద ప్రశంసా పత్రాలు మరియు
ఇప్పటివరకు అందుకున్న అవార్డులు:
*యూనివర్సల్ డెవలప్మెంట్ కౌన్సిల్  వారిచే  డాక్టరేట్ అందుకున్నాను.
*అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కళానిలయం వారిచే  
2021 పురస్కారం. ( తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్  జి చంద్రయ్య గారి చేతులమీదుగా )
*ఆదరణ ఆలయం చారిటీస్ వేదిక సిసిటివి టివి సంయుక్త ఆధ్వర్యంలో
వేదిక తెలుగు నంది జాతీయ విశిష్ట పురస్కారం.అక్షర తపస్వి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాహిత్య అకాడమీ సభ్యులు డా.కత్తిమండ ప్రతాప్ గారి చేతుల మీదుగా.
* ఏకే తెలుగు మీడియా ముంబై వారిచే తెలంగాణ సాహిత్య రత్న పురస్కారం
*సాహితీ బృందావన జాతీయ వేదిక,  తెలుగు భాషా పరిరక్షణ సమితి,    భారతీయ భాష మంచ్.. న్యూఢిల్లీ గార్లచే  కవి తేజ పురస్కారం.
* సాహితీ  బృందావన వేదిక వారిచే సాహిత్య కళానిధి బిరుదు 
*సూరేపల్లి రాములమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ పురస్కారం.
*నవభారత నిర్మాణ సంఘం.. బుద్ధ జయంతి సందర్భంగా (పంచశీల ప్రపంచశాంతి) అంశంపై    ఆధ్వర్యంలో నిర్వహించిన కవితా పోటీలలో ఉత్తమ విజేతగా పురస్కారం అందుకున్నారు.
*సూరే పెళ్లి రాములమ్మ ఉమెన్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  మాతృ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సాహిత్య పోటీలలో విజేతగా పురస్కారం అందుకున్నారు.
*సహరి అంతర్జాల సాహిత్య వార పత్రిక వారు నిర్వహించిన కవితా ప్రతిభ పోటీలలో ప్రశంసా పత్రం అందుకున్నారు.
*మొదటిసారి గౌరవ పారితోషకాన్ని సాహిత్య వార పత్రిక సహరి వారిచే అందుకున్నారు.
*మొదటి వ్యాసం.. వనితా  నీకు వందనం... ఆదాబ్ హైదరాబాద్ దిన పత్రికలో ప్రచురితం.
*మొదటి కవిత   ఓ ఉషోదయ మా...సహరి వార పత్రికలో ప్రచురితం.
*మొదటి కథ విశాలాక్షి సాహిత్య మాస పత్రిక లో ప్రచురితం.
*మొదటి పుస్తక సమీక్ష ఆదాబ్ హైదరాబాద్ దిన పత్రిక తో ప్రచురితమైంది.
*దివిటీ  దిన పత్రిక లో  స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మొదటిసారి సంపాదకీయం గా నా వ్యాసం ప్రచురితం.
*జోర్దార్ దినపత్రిక, పరిమళం సాహిత్య దినపత్రిక వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామనవమి, ఉగాది కవితా పోటీలలో వివిధ ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
*22 ఫిబ్రవరి 2021 న  రాజరాజేశ్వరస్వామి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం రాజన్న సిరిసిల్ల జిల్లా( విద్యనభ్యసించిన కళాశాల) లో అధ్యాపకులచే సన్మానం అందుకున్నారు.
* ఆట,నాటా అంతర్జాతీయ స్థాయి సాహిత్య పోటీలలో పాల్గొన్నారు.
( ఇప్పటివరకు 46 పత్రికలలో డా చిటికెన  కిరణ్ కుమార్ గారి రచనలు ప్రచురితమయ్యాయి )
        *********************
   శ్రీ శ్రీ కళా వేదిక అంతర్జాతీయ అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంష్ట లో   రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శిగా... మరియు తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా సేవలు కొనసాగిస్తున్నారు.వీరు ఇలానే తెలుగు భాష సాహిత్య సేవ చేస్తూ తెలుగు భాష పై మమకారంతో చేస్తున్న వారి సేవ ఇలానే కొనసాగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ...


             
కామెంట్‌లు