సీతాకోకచిలుక (బాలల గీతం):-శాంతి కృష్ణ

 పల్లవి//
రివ్వున ఎగిరే సీతాకోకచిలుకను
రమ్మని ఇపుడే పిలవాలి
కలలకు రంగులు అద్దమని
కొంచెం దానిని అడగాలి...
చరణం-1
విచ్చిన పూలకు నెచ్చెలి నేనై
మెల్లగ ఎగురుతు వెళ్ళాలి
చెలిమి నెత్తావులు పూలకు చల్లి
పకపకమంటూ నవ్వాలి ॥రివ్వున॥ 
చరణం-2
జాబిలి కలలకు తళుకులు నేనే
చక్కగ మాలలు కట్టాలి
నింగిన మెరిసే హరివిల్లులతో
చిలిపిగ  పరుగులు తీయాలి... ॥రివ్వున॥
చరణం-3
చిటపట మంటూ వెన్నెల చినుకులు
చల చల్లగ కురవాలి
కోయిల పాటలు పాడుతు నేను
గంతులు వేసి ఆడాలి ॥రివ్వున॥


కామెంట్‌లు