తెలుగు తేనియలు కీర్తి కిరీటం :-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు

కీర్తి దాహం అంతులేనిదే 
తన ఎదుగుదల కారణమెవరో 
శుభ్రంగ తుడిచేసింది మనసు 
లోకులు ఎందుకిలా ఉందురో? 

నిత్య భజనలో కలిగి అహమే 
కొండలాగా  పెరిగి కూర్చుంది 
చులకనే మనుషులమీద నిలిచి
గర్వం తలకెక్కి నిలబడింది !

పొగరు పెంచిన పొగడ్తలు నీకు 
 చివరికి చేస్తాయి ఎంత హాని  
ఒకనాటికి అర్థం అవుతుంది
నువ్వో అహంకారం గిరి వని !

కామెంట్‌లు