ఏ.పీ.జే అబ్దుల్ కలాం సేవా నిరతి:-యాళ్ళ ఉమామహేశ్వరి-తెలుగు అధ్యాపకురాలు
సాహితీ బృందావన జాతీయ వేదిక: ప్రక్రియ: సున్నితం:రూపకర్త..నెల్లుట్ల సునీత
------------------------
దేశ సేవలో ఉన్నతులు
ఔన్నత్యం చాటిన ధీరులు
మిసైల్మేన్గా పేరొందిన శాస్త్రవేత్త
చూడచక్కని తెలుగు సున్నితంబు.

క్షిపణి ప్రయోగం విజయం
చెదరని చిత్తశుద్ధి అజరామరం
నిరాడంబరమైన జీవన విధానం
చూడచక్కని తెలుగు సున్నితంబు.

ఎంత ఎదిగినా ఒదగడం
ఎన్ని విజయాలున్నా నిగర్వితనం
మక్కువ చూపే పుస్తకపఠనం
చూడచక్కని తెలుగు సున్నితంబు.

దేశ ప్రథమ పౌరుడైనా
నిరాండబర జీవితం జీవించి
ఎనలేని ఖ్యాతి పొందారు
చూడ చక్కని తెలుగు సున్నితంబు.

నిత్య విద్యార్ధిగా ఎదుగుతూ
గురుభక్తిని ఎప్పటికప్పుడు చాటుతూ
మాకు మార్గదర్శకులయ్యారు కలాంజీ 
చూడచక్కని తెలుగు సున్నితంబు.

కామెంట్‌లు