పూజకో పువ్వు.:-తాటి కోల పద్మావతి గుంటూరు.

 అందమైన తెలుగు వనం. 
ఆ వనంలో విరిసింది  సుమం.
.దాని పేరు ముద్దు గులాబి. 
ముద్దుముద్దుగా మురిపిస్తుంది.
లేత నవ్వులు చిందిస్తూ ఉంది.
ఒంపుసొంపుల రేకులతో వయ్యారాలు పోతోంది.
తోటకు నేనే రాణి నంటూ బీరాలు పలుకుతుంది.
దాన్ని చూసి మల్లెపువ్వు పడి పడి నవ్వింది.
తెల్లనైన అందం మల్లె జాజుల సొంతం.
పరిమళాలు పంచుతాం పరవశింప చేస్తాం.
సంధ్యా సమయంలో అందంగా విర బూసి 
మగువ జడలోనో దేవుడి గుడి లో నో 
అందంగా అలంకరించి పాదాలకు ప్రణమిల్లు తాము.
పెళ్లి పేరంటాలకు మేమే స్వాగతం అంటూ ప్రగల్భాలు పలికాయి.
వాటిని చూసి పగలబడి నవ్వింది బంతి పువ్వు.
అందం చందం శాశ్వతం కాదు.
బంతి పువ్వు నైనా ఘనాపాటి నంటూ 
శివపూజ లేకున్నా శవ పూజకు మేము ఉన్నామంది.
పూల పల్లకిలో మృతదేహంపై పూజకు పనికి వస్తాము.
అంతిమ ప్రయాణంలో లో మెడలో మాలల మావు తాము.
పండుగ పబ్బాలకు గడపలకు 
తోరణాలు గా అలంకారం అవుతాము.
ఎవరు గొప్ప వారిదే నంటూ వివరించి చెప్పింది.
పూజకో పువ్వని నిజాన్ని ఒప్పుకున్నాయి.
దరిచేరి దర్భంగా నవ్వు కున్నాయి.