వెంకటేశ్వరా(మధురగతి‌ రగడలు)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్
వెంకట గిరిపై వెలసిన దేవుడు
సంకట హరుడును సాధ్యము ఆతడు

ఆర్తుల గావగ యాపద తీర్చగ
ధూర్తుల పాలిట ధూపము తీరుగ

కలియుగ వరదా కాంచన శోభిత
అలిగిన పత్నికి యందిన కామిత

తిరుపతి యందున తీయని లడ్డులు
కురులను తీసుకు కులికెడి లెక్కలు