*తృష్ణ!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1.ఆగని దహనం!
   తీరని దాహం!
   మొసలి మోహం!
   అసలు భారం!
2.జ్వలించే అగ్నిహోత్రం!
   భస్మం చేసే మూడో నేత్రం!
   బిగిసే ఉరితాడు!
   కాలేకాంక్షల వల్లకాడు!
3.తొలగని భ్రాంతి!
   అణగని అశాంతి!
   ఉడికించే ఉన్మాదం!
   వేధించే విషాదం!
4.తృప్తి తరగని సంపద!
   మరపిస్తుంది మనవ్యధ!
   అందిస్తుంది ఆనందసుధ!
  ముచ్చటగా ముగుస్తుంది కథ!
5.ప్రయత్నం ఆపకు!
   తృష్ణతో వేగకు!
   నైరాశ్యం దాస్యం!
   బతుకు సేద్యం!
   తృప్తి సస్యం!
   బలోపేతం జీవితం!
   అది సర్వజనహితం!

కామెంట్‌లు