*అమ్మయే ఆధారము*(కథ)("రాజశ్రీ" కవితా ప్రక్రియలో)(రెండవభాగము):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్

 5)
అపుడువారు సురరాజును అర్థించారు
యక్షుని మార్కొన ప్రార్థించారు
ఇంద్రుడరిగి యక్షుని గనినంతలోనె
యక్షుడు మాయమయ్యె తృటిలోనె!
6)
గగనవీధిన ఆశ్చర్యముగ కనబడెనంబ
శోభామయ తుహినాచల సంరంభ
సురరాజడిగె ఆమెను ఎవరివీవు
అమ్మఅంది బ్రహ్మమునేనే ఎరుగవీవు!
7)
సుర జయమునకు ఆధారము
నేనే సకల బ్రహ్మాండధరము
ఆమాటలు సకలము వినినంత
సురరాజుకు వికలమాయె హృదియంత!
8)
బ్రహ్మమునకు చేసెను ప్రణిపాతమే
లేకుంటే దైవత్వ నిపాతమే
తెలుసుకొనిరి సురలంతా బ్రహ్మపవిని
చూసిరంత అంతర్హిత బ్రహ్మఛవిని!
(బ్రహ్మపవి=పిడుగువంటి బ్రహ్మము.,ఛవి= కిరణము)
(సమాప్తం)
.