మన బోనం గిట్లుండాలే:-కందగట్ల అనిత ఊరు తొర్రూరు

 మన తెలంగాణ బోనం ఎట్లుండాలే--
అమ్మ కట్టు.. బొట్టు.. మన సంస్కృతి.. 
అన్ని ఉట్టి పడే కళ నైపుణ్యలన్ని ఈ పండగల సుతం.
బోనాల పండగ ప్రతి పల్లె పల్లెన
తెలంగాణ అంతటా దుందాం గా జరుపుతం...
పసుపు ఏసి (అం)వండిన పసిడి అన్నం కుండను 
అని గా పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టి ఏప మండలతో.. 
అలంకరించిన బోనాన్ని తల్లి కి సమర్పించి మొక్కు తీరుస్తాం ప్రతి యేడు.
గుడి సుట్టు పెట్టె ఏప మండల తీరులో 
మహ్హామ్మరిని తరిమెసే  గుణం వుందనే పరమార్ధం ఈ బోనం పండగ...
మైసమ్మ.. మారమ్మ.. పోలేరమ్మ లా ఎందరో ఆదిశక్తి స్వరుపులు మగువలకు ఆదర్శం....
అబలను సబలా ను చేస్తే ఆ అబల హస్తమే త్రిశులమై చీల్చి చెండాడే పరాశక్తి అవుతుంది..
అమ్మాలగన్నా మాయమ్మ కొండంత దైర్యం గా కొలువైయే...
ఎన్ని యుగాలయినా మన తెలంగాణ బోనం చేసుడు
 మన తరతరాలకు 
వారసత్వంగా చేసుకునే పండుగ అని సెప్పాలే...
మన పండుగలను మనమే కాపాడుకోవలే..
 అందులో ఉండే గొప్పతనం సెప్పాలే..
 ఇది నా మాట కానే కాదు మన అందరి మాట..