బాలలం (బాలగేయం) పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.

బాలలం మేం బాలలం
రేపటి భవితకు పునాదులం
అమ్మానాన్నల రూపాలం
భవితకు మేం భవనాలం

గురువుల స్ఫూర్తిని పొందెదం
మొక్కలునే పెంచదం
వాటి లాగే పెరిగెదం
కోరికలున్నా మరిచెదం

 ప్రేమ మమతలు పంచేము
 పనులు ఎన్నో చేసేము
సృజనాసక్తులు చూపెదము
ఆ రవియే మాకు ఆదర్శము.