ముద్దుల పాప (షాడో'స్):--గద్వాల సోమన్న

పాప నవ్వులు
కాంతి దివ్వెలు
తావి మల్లెలు
అందాలు రువ్వు గద్వాల్

పాపాయి పలుకు
అమృతమే చిలుకు
విలువైన సరుకు
చిలుకమ్మ పలుకులే గద్వాల్

నగవు కిలకిల
మాట గలగల
మోము మిలమిల
చిన్నారి ఇంట గద్వాల్

పాప ఊసులు
మదికి శ్వాసలు
తీపి ఆశలు
ఎంతో మధురం గద్వాల్

నవ్వు పకపక
నడక చకచక
ఏల తికమక
పాప అందమే గద్వాల్

కామెంట్‌లు